జనగాం
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఇల్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు జూన్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం అందజేశారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందన్న ఆశతో వారు తమ పాత ఇంటిని కూల్చివేశారు. అయితే అధికారులు ఇప్పుడు వారు ఆ పథకానికి అర్హులు కాదంటూ మాట మార్చడంతో, తలదాచుకోవడానికి నీడ లేక ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు.
