Wednesday, 16 September 2026

Tag: మున్సిపల్ చైర్మన్

జయశంకర్ భూపాలపల్లి

ఎమ్మెల్యే అడుగుజాడల్లో ప్రజా సేవకు మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి, ఆగస్టు 30: ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చూపుతున్న మార్గంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య ముందుకు సాగుతున్నారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు దుర్గం రవి కుమారుడు వైష్ణవ తేజ్‌కు లింఫాడెనైటిస్ అబ్సెస్ (Lymphadenitis Abscess) శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, స్థానిక కౌన్సిలర్లతో కలిసి రవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వైష్ణవ తేజ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ, వారి కష్టాల్లో భాగస్వాములై అండగా నిలవడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చూపిస్తున్న ప్రజాసేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని పట్టణ ప్రజలకు నిరంతరం సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

రక్షాబంధన్ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్

భూపాలపల్లి, ఆగస్టు 28: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, సోదరీమణులు చైర్మన్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు పరస్పర ప్రేమాభిమానాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.