పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నారాయణ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు. ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్ మాట్లాడుతూ “సఫాయీ అప్నావో–బీమారీ భగావో” నినాదంతో పారిశుధ్య కార్మికులు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని సూచించారు.

