Monday, 21 September 2026

Tag: జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మండలం సముద్రాల గ్రామం తెలంగాణ

జనగాం

నారాయణపురంలో కనకదుర్గా దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కనులపండువ

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నారాయణపురం (సముద్రాల) గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆగస్టు 24 నుండి 27 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జలాధివాసం, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభంకాగా, మూడవ రోజు బుధవారం వైదిక మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి విగ్రహ, ప్రాణ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కనకదుర్గ ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.