Thursday, 1 October 2026

Tag: ఒక్కసారిగా కురిసిన

చిత్తూరు

కల్లూరులో కురిసిన భారీ వర్షం: ఉపశమనం పొందిన ప్రజలు

కల్లూరు : సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి): కల్లూరు పట్టణం మరియు దాని పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ప్రజలను పలకరించింది. కొద్దిసేపట్లోనే కుండపోతగా మారిన వాన ధాటికి ప్రధాన రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచి చెరువులను తలపించింది. రాత్రి వేళ ప్రయాణాలు సాగిస్తున్న ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు, పాదచారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలకు ఈ వర్షం పెను ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారడంతో పట్టణవాసులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.