Monday, 28 September 2026
  • Home  
  • ఆరోగ్యం పై అవగాహన బాధితులకు అండగా సపోర్ట్ గ్రూప్
- విశాఖపట్నం

ఆరోగ్యం పై అవగాహన బాధితులకు అండగా సపోర్ట్ గ్రూప్

వాసవ్య మహిళా మండలి, లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకోసోషల్ ఎడ్యుకేషన్ శిక్షణ విశాఖపట్నం జిల్లా,గోపాలపట్నం, సెప్టెంబర్ 28: మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, అపోహలు, వివక్షను తొలగించడం, మానసిక సమస్యలతో జీవిస్తున్న వారికి, వారి కుటుంబాలకు సహకారం అందించడమే లక్ష్యంగా లక్ష్మీనగర్‌లోని గోపాలపట్నంలో సైకోసోషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. వాసవ్య మహిళా మండలి (VMM) ఆధ్వర్యంలో, లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో సంత్వనా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణలో 20 మంది బాధితులు, వారి సంరక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనగర్ యూపీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ కె. దేదీప్య మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, సంరక్షకుల బాధ్యతలు, చికిత్సా విధానాలపై వివరించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మానసిక రుగ్మతల లక్షణాలు, చికిత్సలు, సంత్వనా సేవల గురించి అవగాహన కల్పించారు. సంత్వనా ప్రాజెక్ట్ సూపర్వైజర్ వెంకట కృష్ణ క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్యుల సూచనలు పాటించడం, మానసిక అనారోగ్యం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బాధితులకు నిరంతర మద్దతుగా సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు కార్యక్రమం అనంతరం బాధితులు, సంరక్షకుల మధ్య అనుభవాల పంచుకోవడం, పరస్పర సహకారం, భావోద్వేగ మద్దతు అందించేందుకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సపోర్ట్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ యానిమేటర్లు లిఖిత, ప్రియాంక, మల్లేశ్వరి, ముత్యాలమ్మ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, యూపీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

వాసవ్య మహిళా మండలి, లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకోసోషల్ ఎడ్యుకేషన్ శిక్షణ

విశాఖపట్నం జిల్లా,గోపాలపట్నం, సెప్టెంబర్ 28: మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, అపోహలు, వివక్షను తొలగించడం, మానసిక సమస్యలతో జీవిస్తున్న వారికి, వారి కుటుంబాలకు సహకారం అందించడమే లక్ష్యంగా లక్ష్మీనగర్‌లోని గోపాలపట్నంలో సైకోసోషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు.

వాసవ్య మహిళా మండలి (VMM) ఆధ్వర్యంలో, లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో సంత్వనా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణలో 20 మంది బాధితులు, వారి సంరక్షకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనగర్ యూపీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ కె. దేదీప్య మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, సంరక్షకుల బాధ్యతలు, చికిత్సా విధానాలపై వివరించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మానసిక రుగ్మతల లక్షణాలు, చికిత్సలు, సంత్వనా సేవల గురించి అవగాహన కల్పించారు.

సంత్వనా ప్రాజెక్ట్ సూపర్వైజర్ వెంకట కృష్ణ క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్యుల సూచనలు పాటించడం, మానసిక అనారోగ్యం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

బాధితులకు నిరంతర మద్దతుగా సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు

కార్యక్రమం అనంతరం బాధితులు, సంరక్షకుల మధ్య అనుభవాల పంచుకోవడం, పరస్పర సహకారం, భావోద్వేగ మద్దతు అందించేందుకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సపోర్ట్ గ్రూపును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ యానిమేటర్లు లిఖిత, ప్రియాంక, మల్లేశ్వరి, ముత్యాలమ్మ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, యూపీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.