### SIR కార్యక్రమంలో BLAలు, సీనియర్ నాయకులకు సన్మానం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు SIR-2026 కార్యక్రమంలో సేవలందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ BLAలు, సీనియర్ నాయకులను మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సన్మానించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఇన్‌చార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా BLAలు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు.






