ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో అధికారులు సీడ్ బాల్స్ చల్లారు. రేంజర్ బీఎస్ కుమార్ రాజా ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో చెట్లు పలుచగా ఉన్న ప్రదేశాలను గుర్తించి సీడ్ బాల్స్ వేశారు. వర్షాకాలంలో విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలు పెరిగేలా చర్యలు చేపట్టినట్లు రేంజర్ తెలిపారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పచ్చదనం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అడవుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి ఖాజా మొహమ్మద్, బీట్ అధికారి బి. వెంకటేశ్వర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొని సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో మొక్కలు పెరిగేలా సీడ్ బాల్స్ ఉపయోగపడతాయని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భవిష్యత్లో ప్రాంతాల్లో కార్యక్రమం చేపడతామని చెప్పారు.

ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్