Thursday, 1 October 2026
  • Home  
  • SBI ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం
- నిర్మల్

SBI ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

నిర్మల్ జిల్లా అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ ఆదిలాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్.ఎం రంజన్ కుమార్ ప్రోత్సాహంతో, హెచ్.ఆర్. మేనేజర్ (మానవ వనరులు) బాలకృష్ణ ఆధ్వర్యంలో చెత్తాచెదారం తొలగింపు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో భాగం కావాలని, స్వచ్ఛమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్ ధాం, ఎఫ్.ఐ. మేనేజర్ మెహర్ బాబు, ఎస్బీఐ సిబ్బంది సుసాన్ బ్యూల, రామకృష్ణ, నాగరాజు, సంతోష్, పాపయ్య, శివరాం, సంజయ్, సంజీవ్, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, రవి, సాయి, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి)
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ ఆదిలాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్.ఎం రంజన్ కుమార్ ప్రోత్సాహంతో, హెచ్.ఆర్. మేనేజర్ (మానవ వనరులు) బాలకృష్ణ ఆధ్వర్యంలో చెత్తాచెదారం తొలగింపు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో భాగం కావాలని, స్వచ్ఛమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్ ధాం, ఎఫ్.ఐ. మేనేజర్ మెహర్ బాబు, ఎస్బీఐ సిబ్బంది సుసాన్ బ్యూల, రామకృష్ణ, నాగరాజు, సంతోష్, పాపయ్య, శివరాం, సంజయ్, సంజీవ్, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, రవి, సాయి, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.