Thursday, 10 September 2026
  • Home  
  • S.I.R.పై విద్యార్థులకు అవగాహన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

S.I.R.పై విద్యార్థులకు అవగాహన

గూడూరు సెప్టెంబర్10 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ’ (S.I.R. – Special Intensive Revision)పై ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఆర్డీవో శ్రీమతి వి. అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ వై. మల్లికార్జున రావు, ఎంఆర్ఓ శ్రీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, యువత ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతతో పాటు S.I.R. ప్రక్రియపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా గూడూరు ఆర్డీవో శ్రీమతి వి. అరుణకుమారి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వై. మల్లికార్జున రావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకొని ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పేర్కొన్నారు. ఎంఆర్ఓ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి శ్రీ వి. రమణారెడ్డి, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ బి. యశోద, శ్రీమతి ఎన్. వసంత, డాక్టర్ ఏ.వి. ప్రసాద్, డాక్టర్ విజయ మహేశ్, శ్రీమతి మైమూన్, శ్రీమతి కృపాకరుణవాణి మరియు ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు సెప్టెంబర్10 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ’ (S.I.R. – Special Intensive Revision)పై ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఆర్డీవో శ్రీమతి వి. అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ వై. మల్లికార్జున రావు, ఎంఆర్ఓ శ్రీ ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, యువత ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతతో పాటు S.I.R. ప్రక్రియపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా గూడూరు ఆర్డీవో శ్రీమతి వి. అరుణకుమారి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ వై. మల్లికార్జున రావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకొని ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పేర్కొన్నారు.
ఎంఆర్ఓ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్. కిరణ్మయి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి శ్రీ వి. రమణారెడ్డి, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ బి. యశోద, శ్రీమతి ఎన్. వసంత, డాక్టర్ ఏ.వి. ప్రసాద్, డాక్టర్ విజయ మహేశ్, శ్రీమతి మైమూన్, శ్రీమతి కృపాకరుణవాణి మరియు ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.