NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు
1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.


