ఉపాధి హామీ పనులను పారదర్శకంగా నిర్వహించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ఉపాధి హామీ కింద జరుగుతున్న రోడ్డు చదును పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటించి, మహిళా కూలీల సమస్యలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. చెరువుల అభివృద్ధి, వాననీటి సంరక్షణ, రోడ్డు పనులు గ్రామీణాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ రహదారుల అభివృద్ధితో రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ యాదగిరి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు


