టెట్ పరీక్షల నిర్వహణలో వికలాంగ అభ్యర్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని ఎన్పీఆర్డీ వికలాంగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కోట్ల గౌతమ్ కోరారు. జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా వికలాంగులు టెట్ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 2016 హక్కుల చట్టాన్ని అనుసరించి ప్రతి కేంద్రంలో ర్యాంపులు, వీల్‌చెర్ల సౌకర్యం ఉంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి స్క్రైబ్ సదుపాయం కల్పించాలన్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


