మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సౌండ్ సిస్టం కుర్చీలు బహుకరించిన కత్తుల ఆనందరావు
అమలాపురం జూలై 18
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అంబాజీపేట మండలం గంగల కుర్రు అగ్రహారం మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకార్యార్ధం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత , విజయానంద స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు” సేవా కిరీటి” కత్తుల ఆనందరావు 12,000/- రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టం విద్యార్థులకు 10 కుర్చీలు ఈ రోజు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పితాని శ్రీనివాసరావు కు అందజేశారు. విద్యార్థుల అభివృద్ధిలో భాగంగా సౌండ్ సిస్టం కుర్చీలు విద్యార్థులకు ఉపయోగపడతాయని వీటిని బహుకరించిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు కత్తుల ఆనందరావు ను శ్రీనివాసరావు అభినందించారు . ఆనందరావు ఉపాధ్యాయుడిగా విద్య విలువ తెలుసు కాబట్టి విద్యార్థుల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారని ఆయన కొని యాడా రు. విద్యార్థుల కోసం చేసే ప్రతీ సహాయం దేశ నిర్మాణంలో భాగమని, సేవా స్ఫూర్తి ఉన్నచోట విద్య వికసిస్తుందనిఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ పాఠశాలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులు కు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఉపాధ్యాయులు పితాని శ్రీనివాసరావు బల్ల శ్రీనివాసు, ఎల్. ఎన్ .వి. రవి కుమార్, డి.ఎస్. రమేష్ బి .ఏ. మంగతాయారు ఆనందరావు సేవా నిరతిని అభినందిచినారు.


