తేదీ: 13-08-2026
పున్నమి రిపోర్టర్
లక్షెట్టిపేట: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి NEET-2027 లాంగ్‌టర్మ్ శిక్షణ నిర్వహించనున్నట్లు కాళేశ్వరం జోన్–1 జోనల్ ఆఫీసర్ శ్రీమతి ఏ. శారద తెలిపారు.
NEET-2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించేందుకు హైదరాబాద్‌లోని TGSWR Foundation COEలో బాలురకు, మహేంద్ర హిల్స్ Foundation COEలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ శిక్షణకు బాలురకు 100, బాలికలకు 100 చొప్పున మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అర్హతలు
2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (BPC) ఉత్తీర్ణులై, NEET-2026 ప్రవేశ పరీక్షకు హాజరైన SC/ST/OBC/EWS విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని జోనల్ ఆఫీసర్ తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు TGSWREIS అధికారిక వెబ్సైట్ tgswreis.telangana.gov.in ను సందర్శించి నోటిఫికేషన్‌లోని వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెబ్‌సైట్‌లోని దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జతపరిచి, నిర్దేశిత గడువులో సంబంధిత TGSWREIS జిల్లా కోఆర్డినేటర్ (DCO) కు సమర్పించాలి. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు.
చివరి తేదీ: 22-08-2026
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని NEET-2027లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని జోనల్ ఆఫీసర్ శ్రీమతి ఏ. శారద కోరారు.

NEET-2027 లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
తేదీ: 13-08-2026 పున్నమి రిపోర్టర్ లక్షెట్టిపేట: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి NEET-2027 లాంగ్‌టర్మ్ శిక్షణ నిర్వహించనున్నట్లు కాళేశ్వరం జోన్–1 జోనల్ ఆఫీసర్ శ్రీమతి ఏ. శారద తెలిపారు. NEET-2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించేందుకు హైదరాబాద్‌లోని TGSWR Foundation COEలో బాలురకు, మహేంద్ర హిల్స్ Foundation COEలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణకు బాలురకు 100, బాలికలకు 100 చొప్పున మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హతలు 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (BPC) ఉత్తీర్ణులై, NEET-2026 ప్రవేశ పరీక్షకు హాజరైన SC/ST/OBC/EWS విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని జోనల్ ఆఫీసర్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు TGSWREIS అధికారిక వెబ్సైట్ tgswreis.telangana.gov.in ను సందర్శించి నోటిఫికేషన్‌లోని వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌లోని దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను జతపరిచి, నిర్దేశిత గడువులో సంబంధిత TGSWREIS జిల్లా కోఆర్డినేటర్ (DCO) కు సమర్పించాలి. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు. చివరి తేదీ: 22-08-2026 అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని NEET-2027లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని జోనల్ ఆఫీసర్ శ్రీమతి ఏ. శారద కోరారు.

