Tuesday, 22 September 2026
  • Home  
  • నందలూరులో రూ.1.30 లక్షలకు వినాయకుని లడ్డూను దక్కించుకున్న కొట్టే మణెమ్మ కుటుంబ సభ్యులతో ఉత్సవ కమిటీ సభ్యులు.
- అన్నమయ్య

నందలూరులో రూ.1.30 లక్షలకు వినాయకుని లడ్డూను దక్కించుకున్న కొట్టే మణెమ్మ కుటుంబ సభ్యులతో ఉత్సవ కమిటీ సభ్యులు.

నందలూరు మండలంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే బ్రాహ్మణ వీధి వినాయక మండపం వద్ద డీజే గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని లడ్డూ వేలం పాటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఉంచిన 21 కేజీల మహా లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ వేలం పాటలో రాజంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి తల్లి కొట్టే మణెమ్మ రూ.1,30,000లకు వేలం పాడి మహా గణపతి లడ్డూను దక్కించుకున్నారు. గతంలో ఈ లడ్డూను దక్కించుకున్న వారికి విశేషమైన శుభాలు కలిగాయని భక్తుల నమ్మకం. దీంతో ఈ వేలం పాటలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోనే భారీ ధరకు వేలం జరిగే వినాయకుని లడ్డూలలో ఇది ఒకటని, నందలూరు మండలంలో ఈ లడ్డూకు విశేష ప్రాధాన్యత ఉందని నిర్వాహకులు తెలిపారు. వేలం పాట అనంతరం లడ్డూను దక్కించుకున్న కొట్టే మణెమ్మను, ఆమె కుమారుడు కొట్టే శ్రీహరిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మేళతాళాలు, బాణసంచా నడుమ ఊరేగింపుగా వారి ఇంటి వరకు వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ.. తమ కుటుంబం పవిత్రమైన వినాయకుని లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, విఘ్నేశ్వర స్వామి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నందలూరు మండలంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే బ్రాహ్మణ వీధి వినాయక మండపం వద్ద డీజే గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని లడ్డూ వేలం పాటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఉంచిన 21 కేజీల మహా లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.

ఈ వేలం పాటలో రాజంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి తల్లి కొట్టే మణెమ్మ రూ.1,30,000లకు వేలం పాడి మహా గణపతి లడ్డూను దక్కించుకున్నారు. గతంలో ఈ లడ్డూను దక్కించుకున్న వారికి విశేషమైన శుభాలు కలిగాయని భక్తుల నమ్మకం. దీంతో ఈ వేలం పాటలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఉమ్మడి కడప జిల్లాలోనే భారీ ధరకు వేలం జరిగే వినాయకుని లడ్డూలలో ఇది ఒకటని, నందలూరు మండలంలో ఈ లడ్డూకు విశేష ప్రాధాన్యత ఉందని నిర్వాహకులు తెలిపారు.

వేలం పాట అనంతరం లడ్డూను దక్కించుకున్న కొట్టే మణెమ్మను, ఆమె కుమారుడు కొట్టే శ్రీహరిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మేళతాళాలు, బాణసంచా నడుమ ఊరేగింపుగా వారి ఇంటి వరకు వెళ్లి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ.. తమ కుటుంబం పవిత్రమైన వినాయకుని లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, విఘ్నేశ్వర స్వామి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.