Wednesday, 17 June 2026
  • Home  
  • K K దామోదర్ రావు ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రీన్ పోస్టర్ డ్రాయింగ్ పోటీలు
- కర్నూలు

K K దామోదర్ రావు ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రీన్ పోస్టర్ డ్రాయింగ్ పోటీలు

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించనున్న మండల స్థాయి ఇంటర్నేషనల్ గ్రీన్ పోస్టర్ డ్రాయింగ్ కాంటెస్ట్–2026 పోటీలకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్, లయన్ కే.కే. ధామోదర్ రావు విద్యార్థులకు పోటీ వివరాలను తెలియజేశారు. “Inspired by Nature for Climate for Our Future” అనే అంశంపై నిర్వహించనున్న ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులకు పోస్టర్ రూపకల్పన విధానం, చిత్రలేఖనంలో పాటించాల్సిన అంశాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రాయింగ్ ప్రాక్టీస్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, పరిశుభ్రత వంటి అంశాలను విద్యార్థులు తమ దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ అంశాలపై చిత్రాలు రూపొందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమాన్ని అభినందించారు.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించనున్న మండల స్థాయి ఇంటర్నేషనల్ గ్రీన్ పోస్టర్ డ్రాయింగ్ కాంటెస్ట్–2026 పోటీలకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్, లయన్ కే.కే. ధామోదర్ రావు విద్యార్థులకు పోటీ వివరాలను తెలియజేశారు. “Inspired by Nature for Climate for Our Future” అనే అంశంపై నిర్వహించనున్న ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని సూచించారు.

కార్యక్రమంలో విద్యార్థులకు పోస్టర్ రూపకల్పన విధానం, చిత్రలేఖనంలో పాటించాల్సిన అంశాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రాయింగ్ ప్రాక్టీస్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, పరిశుభ్రత వంటి అంశాలను విద్యార్థులు తమ దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ అంశాలపై చిత్రాలు రూపొందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమాన్ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.