నిర్మల్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ (SHAKTI) విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన GO నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ BRSV నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం, ఆగస్టు 31న ధర్నా నిర్వహించనున్నారు.
ఈ ధర్నాకు BRSV నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRSV జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ పిలుపునిచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని GO 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
GO 97 రద్దు కోసం BRSV ధర్నాకు భారీగా తరలిరండి
నిర్మల్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ (SHAKTI) విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన GO నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ BRSV నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం, ఆగస్టు 31న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు BRSV నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRSV జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని GO 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

