పీర్జాదిగూడ సాయినగర్ కాలనీలో గోల్డెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిబిఎస్ఎ నిర్వహించిన లక్కీ డ్రాలో గణేష్ లడ్డూను టేకుల అరుణ గెలుచుకున్నారు.
టేకుల మోహన్ రెడ్డి, మనమ్మ దంపతులు తమ మనవరాలు టేకుల అరుణ పేరుతో లక్కీ డ్రాలో పాల్గొనగా, డ్రాలో ఆమె పేరు విజేతగా వచ్చింది.ఈ సందర్బంగా డ్రా గెలుపొందిన
టేకుల మోహన్ రెడ్డి దంపతులలు మాట్లాడుతూ:
“గణనాథుడి ఆశీస్సులతో తమ మనవరాలు టేకుల అరుణ పేరు లక్కీ డ్రాలో రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గోల్డెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసోసియేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని కోరుకుంటున్నాం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ నిమజ్జనోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు.



