EPFO New Rules | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు ఇంటి సంబంధిత అవసరాల కోసం తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇటీవలి ఈపీఎఫ్వో మార్గదర్శకాల ప్రకారం.. సభ్యత్వం పొంది ఏడాది దాటితే అందుబాటులో ఉన్న మొత్తం నిధిలో నిబంధనలకు లోబడి 75 శాతం వరకు వెనుకకు తీసుకోవచ్చు. ఈ సొమ్మును ఇంటి కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, నవీకరణ, ఇప్పటికే ఉన్న గృహ రుణాన్ని తీర్చేందుకు వాడుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్వో సంస్కరణల్లో భాగంగా మారిన నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యులు తమ ఉద్యోగ జీవితకాలంలో గరిష్ఠంగా ఐదుసార్లు ఇంటి కోసం నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు.


