Friday, 25 September 2026
  • Home  
  • ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
- అన్నమయ్య

ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.

*ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.* *కరువు సహాయక చర్యలు చేపట్టాలి.* *ఎర్రగుంట్ల మండలం సిరాజుపల్లి గ్రామంలో ఎండిపోయిన చీని తోటలను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు గారు* ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు శుక్రవారం ఎర్రగుంట్ల మండలం సిరాజ్ పల్లి గ్రామంలో ఎండిపోయిన చీని తోటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదు గాక పంటల సాగు జరగలేదని ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని భూగర్భ జలాలు పడిపోతున్నాయని తక్షణం ప్రభుత్వం కరువు బృందాలను పంపి కరువు అంచనా వేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితి పై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర కరువు నివేదిక పంపి అత్యవసర ఆర్థిక సహాయం కోరాలని ప్రభుత్వ గణాంకాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను ఆధారంగా చేసుకుని సమగ్ర కరువు నివేదిక రూపొందించాలి అని ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కరువు ప్రభావిత మండలాలను ప్రకటించి ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు, జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని త్రాగునీటి ఎద్దడికి చెరువుల నింపుదల ఆరుతడి పంటలకు నిరంధించి కరువు రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు గంగ ,కేసీ కెనాల్ కు నీటి కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆయన కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.కరువు ప్రభావిత ప్రాంతాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రబీ సీజన్లో రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని కరో ప్రాంతాలకు కరువు పనులు కల్పించి రోజుకు 700 చొప్పున వేతనం చెల్లించాలని ఆయన తెలిపారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న కాలంలో దశల వారి పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్ల ఆయన హెచ్చరించారు. ఈ కరువు పర్యటన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి కడప సిటిజన్ ఫోరం నాయకులు కుమారస్వామి రెడ్డి మండల రైతు సంఘం నాయకులు శివారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భాషా తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు

*ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.*
*కరువు సహాయక చర్యలు చేపట్టాలి.* *ఎర్రగుంట్ల మండలం సిరాజుపల్లి గ్రామంలో ఎండిపోయిన చీని తోటలను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు గారు*
ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు శుక్రవారం ఎర్రగుంట్ల మండలం సిరాజ్ పల్లి గ్రామంలో ఎండిపోయిన చీని తోటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదు గాక పంటల సాగు జరగలేదని ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని భూగర్భ జలాలు పడిపోతున్నాయని తక్షణం ప్రభుత్వం కరువు బృందాలను పంపి కరువు అంచనా వేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితి పై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర కరువు నివేదిక పంపి అత్యవసర ఆర్థిక సహాయం కోరాలని ప్రభుత్వ గణాంకాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను ఆధారంగా చేసుకుని సమగ్ర కరువు నివేదిక రూపొందించాలి అని ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కరువు ప్రభావిత మండలాలను ప్రకటించి ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు, జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని త్రాగునీటి ఎద్దడికి చెరువుల నింపుదల ఆరుతడి పంటలకు నిరంధించి కరువు రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు గంగ ,కేసీ కెనాల్ కు నీటి కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆయన కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.కరువు ప్రభావిత ప్రాంతాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రబీ సీజన్లో రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని కరో ప్రాంతాలకు కరువు పనులు కల్పించి రోజుకు 700 చొప్పున వేతనం చెల్లించాలని ఆయన తెలిపారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న కాలంలో దశల వారి పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్ల ఆయన హెచ్చరించారు. ఈ కరువు పర్యటన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి కడప సిటిజన్ ఫోరం నాయకులు కుమారస్వామి రెడ్డి మండల రైతు సంఘం నాయకులు శివారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భాషా తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.