Friday, 25 September 2026
  • Home  
  • రబీ శనగ రైతులకు డీఏపీ పంపిణీ
- కడప

రబీ శనగ రైతులకు డీఏపీ పంపిణీ

(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, సెప్టెంబర్ 25: గొల్లలగూడూరు సచివాలయం పరిధిలో రబీ సీజన్‌లో శనగ సాగు చేయనున్న రైతులకు శుక్రవారం డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులకు ఎరువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ శనగ సాగుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం త్వరలో 50 శాతం రాయితీపై అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో పొందుతూ శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, సెప్టెంబర్ 25:
గొల్లలగూడూరు సచివాలయం పరిధిలో రబీ సీజన్‌లో శనగ సాగు చేయనున్న రైతులకు శుక్రవారం డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులకు ఎరువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ శనగ సాగుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం త్వరలో 50 శాతం రాయితీపై అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో పొందుతూ శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.