ఘనంగా ‘బాస్’ కళ్యాణ మండప నిర్మాణ పనుల ప్రారంభం
పలమనేరు, సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి )
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గోబిళ్ళ కోటూరు వద్ద నిర్మిస్తున్న బలిజ అభ్యుదయ సేవా సంఘం (బాస్) కళ్యాణమండపాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్ మాట్లాడుతూ.. సమాజంలో అందరూ కలిసిమెలసి ఉండాలని, సమిష్టి కృషితో పనిచేసి మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం సభ్యులు గౌరవాధ్యక్షులు, అధ్యక్షులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు సభ్యులు కళ్యాణ మండప నిర్మాణానికి తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. అనంతరం గౌరవాధ్యక్షులు, అధ్యక్షులను సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి.జె.సి. బాబు, లాయర్ లక్ష్మీపతి, జిల్లేడు అరుణ్ కుమార్, జనార్దన్, సోమశేఖర్ నాయుడు, గాజుల చంద్ర, కిరణ్, చెంచు రెడ్డి, కోటేశ్వర్లు, సుదర్శన్ బాలాజీ, డిష్ రమేష్, లక్ష్మీపతి, చిట్టి, గోవర్ధన్, గణేష్, అమ్ములు, తావడపల్లి శంకర, పూల చైతన్య మోహన్, మునిరాజా, రఘునాథ్, జగదీష్, కేశవ, సుబ్బు, చంద్రమౌళి, రవి, శ్యామ్, గజేంద్రతో పాటు బలిజ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





