పుంగనూరు, సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సామాన్య ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించేందుకు రైతు బజార్లు ఎంతగానో ఉపయోగపడతాయని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను బుధవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు దీని ద్వారా కలుగుతుందని, ఇది రైతులతో పాటు ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని వివరించారు. కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్థానిక రైతులు, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు, వ్యాపారులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పుంగనూరులో నూతన రైతు బజార్‌ను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్
పుంగనూరు, సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సామాన్య ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించేందుకు రైతు బజార్లు ఎంతగానో ఉపయోగపడతాయని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను బుధవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు దీని ద్వారా కలుగుతుందని, ఇది రైతులతో పాటు ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని వివరించారు. కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్థానిక రైతులు, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు, వ్యాపారులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

