**తూర్పుగోదావరి జిల్లా:** కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటన ప్రభావంతో విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. రైల్వే మార్గంలో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తునిలో అలెప్పీ ఎక్స్‌ప్రెస్, అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్, సామర్లకోటలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, అనకాపల్లిలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పట్టాలు తప్పిన రైలును తొలగించి రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టాల్సి ఉంది.


