Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

పలమనేరు,జూన్25,2020(పున్నమి విలేకరి): ఆశావర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ… ఆశాలను రెగ్యులరైజ్ చేసి,చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కోవిడ్ డ్యూటీ లో ఉన్న ఆశా లకు నెలకు ప్రత్యేక అలవెన్సు రూ.10000 ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు వర్తింపజేయాలని,3సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న యూనిఫామ్స్ వెంటనే అందచేయాలన్నారు.రక్షణ చర్యలు చేపట్టకుండా రోగులను ఆసుపత్రికి చెకప్ ల కోసం తీసుకురావాలని ఒత్తిడి చేవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా డివిజన్ కార్యదర్శి సావిత్రి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఆశాలు సలోమీ,పద్మ,కైరున్నిసా,గీత లతో పాటు మండలం లోని ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబు పాచిక పారేనా ?

చంద్ర‌బాబు పాచిక పారేనా ? టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కాషాయంవైపు చూస్తున్నారా ? మోడీతో చెలిమి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అందుకే ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారా ? ప‌రిణామాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీపై ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు ఇప్పుడు నెమ్మదించారు. అధికారంలో లేరు. ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది నాయ‌కులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్కెచ్ తో ముందుకెళ్తే బలపడవచ్చనే దానిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. 151 సీట్ల మెజార్టీతో బ‌ల‌మైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జ‌గ‌న్ జెట్ స్పీడుతో ముందుకెళుతున్నారు. అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్ర‌భుత్వంపై కౌంటర్ లు కూడా వేయలేని స్థితికి తీసుకొచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఆరు నెల‌ల పాల‌న అనంత‌రం విమ‌ర్శ‌లుగానీ, ఆరోప‌ణ‌లుగానీ చేస్తామ‌న్న చంద్ర‌బాబు, ‌వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. అయినా అధికార‌పార్టీని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువగా గెలవడం.. గెలిచినవారు కూడా ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం, ఇత‌ర పార్టీల‌కు జంప్ చేయ‌డంతో చంద్ర‌బాబు మ‌రింత కుంగిపోతున్నారు. ఇక టీడీపీ నేత‌లపై కేసులు న‌మోదు కావ‌డం, అరెస్టులు జ‌ర‌గ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు. ఒక‌వైపు పార్టీ ఏమైపోతుంది అన్న టెన్ష‌న్ వుంటే మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో సీఎం జగన్ పడడంతో ఎన్నడూ చూడని రాజకీయ విచిత్రాల‌ను చంద్ర‌బాబు తొలిసారి చ‌విచూస్తున్నారు. ఇంకోవైపు కరోనా ప్ర‌బ‌లిపోతుండ‌డంతో గ‌తంలోలాగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలంటే త‌న ఒక్క‌డితో సాధ్య‌మ‌య్యే ప‌నికాదన్న విష‌యాన్ని గ్ర‌హించారు. ఈ త‌రుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాటం చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ స‌ర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే బీజేపీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తుందోంటూ బీజేపీ ప్ర‌భుత్వంపైన ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు, అంత‌టితో ఆగ‌కుండా ఏకంగా మోడీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని మోడీతో దోస్తీకి సై అంటూ సంకేతాలిస్తున్నారు. అయినా అటువైపు నుంచి స‌మాధానం రావ‌డం లేదు స‌రిక‌దా బాబుని క‌న్నెత్తైనా చూడ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం ర‌మేష్‌, కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే. అయితే వీరి ద్వారా రాయ‌బారం న‌డుపుతారా ? అలా అనుకున్నా చంద్ర‌బాబు గురించి నేరుగా మోడీతో మాట్లాడేందుకు సాహ‌సిస్తారా ? అనేది ప్ర‌శ్నార్ధకం. ఎన్నిక‌ల ముందు మోడీతో సున్నం పెట్టుకున్న చంద్ర‌బాబుకు, ఇప్పుడు ఆయ‌న‌ను ఎలా ప్ర‌స‌న్నం చేసుకోవాలో మాత్రం బోధ‌ప‌డ‌డం లేదు. ఇక‌ ఎప్ప‌టినుంచో ఏపీలో ఒంట‌రిగా ఎద‌గాల‌ని బీజేపీ క‌ల‌లు కంటూ వ‌స్తోంది. ఇప్పుడు టీడీపీ హ‌వా త‌గ్గ‌డం, మ‌రో బ‌ల‌మైన పార్టీ లేక‌పోవ‌డంతో త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీతో బీజేపీ చెలిమి చేసే అవ‌కాశ‌ముందా ? అస‌లు అంత అవ‌స‌రం వుందా ? అందులోనూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మోడీని దూషించిన చంద్ర‌బాబుతో దోస్తీ చేసేందుకు ముందుకొస్తుందా ? అన్న‌ది అనుమాన‌మే. అయినా చంద్ర‌బాబు ప్ర‌స్తుతం అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీతో స‌ఖ్య‌త‌తో ఉంటే భ‌విష్య‌త్తులోనైనా స‌త్ఫ‌లితాలిస్తాయ‌నే భావ‌న‌లో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలన్నా, జ‌గ‌న్ దూకుడుకు క‌ళ్ళెం వేయాల‌న్నా క‌మలంతో జ‌ట్టు క‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు అదే ఆలోచ‌న‌తోనే ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌లికాలంలో ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే. అయితే మోడీ ఏమీ చంద్రబాబుకి చుట్టం కాదు, ఏది చెప్పినా వినేయ‌డానికి, న‌మ్మేయ‌డానికి. రాజకీయాలలో ద్వంద్వ వైఖరితో చ‌క్రం తిప్ప‌డంలో, ఎప్పటికప్పుడు నాలుక మడత వేయ‌డంలో దిట్టగా పేరొందిన చంద్ర‌బాబు… మోడీ ముందు వేస్తున్న స్నేహ‌ పాచిక పారేనా ? అది జ‌రిగే ప‌నేనా ?

Featured

వైకాపా ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక గుర్తింపు

పలమనేరు, జూన్23,2020 (పున్నమి విలేకరి): వైకాపా ప్రభుత్వం హయాంలోనే కాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక గుర్తింపు అందుతుందని రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ రాష్ట్ర బడ్జెట్లో రూ2847 కోట్లును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ , చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే సత్తా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం రూ15000వేల చొప్పున ఐదేళ్ళు లబ్దిదారులకు అందజేయడం జరుగుతున్న దన్నారు . వైయస్సార్ కాపు నేస్తం పథకం 45-60 ఏళ్ళు మధ్య వయసున్న మహిళల కాపు, బలిజ, తెలగ ఉప కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సుదర్శన్ రాయల్,ఆకులు గజేంద్ర, జింక చలపతి,పలమనేరు బలిజ సంఘం అధ్యక్షుడు పి జె సి బాబు, ఏ సి బాబు, దైవ ప్రసాద్, కిరణ్, బాల గురునాథ్, నరేష్,హరీష్,రవి తదితరులు పాల్గొన్నారు.

Featured

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక లబ్ధి చేకూర్చన సందర్భంగా మంగళవారం పలమనేరు పట్టణంలోని జిలాని కూడలిలో వైఎస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి చేసిన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజా సంకల్ప యాత్ర సమయంలో టైలర్ లు, రజకులు, నాయిబ్రాహ్మణులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఖాతాలో రూ 10 వేలు జమచేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి కొందరు అర్హులు కాలేకపోయారు.అర్హులు మరల దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజులు సమయం పొడిగించారని తద్వార అందరూ ధరఖాస్తు చెసుకోవలన్నారు. నాయి బ్రాహ్మణలు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో చేదోడు పథకం ద్వారా 10వేల ఆర్థిక సహాయం అందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

రైతుల ఆత్మహత్యా యత్నం

*రైతుల ఆత్మహత్యా యత్నం* *జగనన్న న్యాయం చేయక పోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు* తడ మండలం తడ హరిజన వాడలో రైతులు చిన్నపిల్లలు సైతం పెట్రోల్ బాటిల్ చేతపట్టుకొని మేము పండించే భూములు జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపడుతున్నారు రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే రైతుల కడుపు కొట్టడం న్యాయమేనా అని ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాలు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఇంటి పట్టాల కొరకు ఇవ్వాలి అని అనుకుంటే మా గ్రామం చుట్టూ ప్రభుత్వ భూములు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమిని ఇవ్వచ్చు కదా మేము సాగు చేసుకుంటూ ఆ భూమిపై బ్రతుకుతున్న మా దగ్గర నుంచి లాక్కోవడం ఎంతవరకు న్యాయమంటున్న రైతులు వెంటనే రైతుల ఇబ్బందులను తెలుసుకొని కలెక్టర్ గారూ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మండల తాసిల్దారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వవలసింది గా కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని గ్రామస్థులు కోరడంమైనది.

Featured తూర్పు గోదావరి

అమలాపురం డివిజన్ లో తొలి కరోనా మరణం

అమలాపురం డివిజన్ లో కరోనా బారిన పడి తొలిసారిగా ఒక వ్యక్తి మరణించడం జరిగిందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుండి అమలాపురం వచ్చి స్థానికంగా ఒక లాడ్జి లో వుండటం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. అయితే అతనికి విపరీతమైన కరోనా లక్షణాలు వుండటంతో అతన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారని అయితే తరలించే క్రమంలో నిన్న సాయంత్రం ఆ వ్యక్తి మరణించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రు నాట్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని దీనితో అతని కుటుంబ సభ్యులకు కూడా ఆర్.టీ.పి.సి.ఆర్. పరీక్షకు శాంపిల్స్ తీసుకుని వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. డివిజన్ లో సంభవించిన కరోనా తొలి మరణాన్ని అతి పెద్ద హెచ్చరిక గా భావించి ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ విచక్షణతో మెలగాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రజలకు కరోనా పై వినూత్నమైన రీతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆర్.డి. ఓ అన్నారు. అధికారులు ఏమిచేసినా ఎంత చెప్పినా ప్రజల ఆరోగ్యం కొరకే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని, కొన్ని రోజులపాటు సరదాలకు,సంతోషాలకు దూరంగా వుండి క్రమశిక్షణ తో మెలగాలని ఆర్.డి. ఓ. విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మనం కరోనా అత్యున్నత స్థాయికి చేరువలో వున్నామనే విషయాన్ని గుర్తించి కరోనా నుండి బయట పడేందుకు అన్ని జాగర్తలు తీసుకోవాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.అత్యవసరం అయితే గాని బయట తిరగవద్దని,మాస్క్ లు లేకుండా అసలే తిరగవద్దని, సామాజిక దూరం పాటించాలని,అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

Featured

అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేబినార్ ద్వారా ఇంటి వద్దదే కుంటుంబం తో యోగ అనే కార్యక్రమం✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భముగా విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఇంటివద్ద యోగా , కుటుంబం తో యోగా అనే అంశంపై ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం గా అలవాటు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం నెల కొని వున్న పరిస్థితులలో మన సంప్రదాయ పద్ధతులు అయిన యోగ అలాగే ఆయుర్వేదమును అందరు ఆచరించాలని కోరారు. మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారు యోగ మరియు ఆయుర్వేదమును శాస్త్రీయ పద్దతిలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నెలకొనివున్న కోవిద్-19 విపత్కర పరిస్థితులలో ఇలా ఆన్ లైన్ లో కలుసుకోవలసి వచ్చిందని, ఇది ఒకరకంగా బాధాకరమైన అంశమైనా, ఇప్పుడు అందరు నూతనముగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీ ను వినియోగించుకొని సరికొత్త పద్దతిలో కాన్ఫెరెన్సెస్ మరియు వర్కుషాప్స్ నిర్వహించగలుగుతున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరము నుంచి విశ్వవిద్యాలయం యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంబించామని అన్నారు. లాక్ డౌన్ సమయం లో VSU NSS సెల్ వారు చేసిన సేవలను అయన కొనియాడారు. తదనంతరం రాష్ట్ర NSS అధికారి డా. కె. రమేష్ రెడ్డి గారు యోగ యొక్క ప్రాముఖ్యతను విపులంగా వివరించారు. తదనంతరం స్థానిక సర్టిఫైడ్ యోగ ప్రక్షనేర్ శ్రీమతి స్వప్న గారి అంతర్జాతీయ యోగ దిన ప్రోటోకాల్లో వున్న వివిధ రకాల యోగాఆసనాలను ఆన్లైన్లో చేసిచూపించారు. అలాగే నేచర్ థెరపిస్ట్ శ్రీ ఎం వి. ప్రసన్న కుమార్ గారు కోవిద్-19 నిరోదించటంలో నేచురోపతి మరియు యోగ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా అందరికి తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి గారు యోగ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెబినార్ కు NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం నిర్వాకునిగా , NSS ప్రోగ్రాం అధికారి డా. వై. విజయ, మోడరేటర్ గా మరియు NSS ప్రోగ్రాం అధికారి డా. సుశీల, ముగింపు కార్యక్రమాన్నీ సమన్వయము చేశారు. ఈ వెబినార్ లో విశ్వవిద్యాలయానికి సంబందించిన NSS ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు పిన్సిపల్స్ మరియు NSS వాలంటీర్లు మరియు విద్యార్థులు సుమారు 200ల మంది పాల్గొన్నారు.  

Featured

తడ మండలం లో విషాదం

తడ మండల చేనిగుంట గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు AMC మాజీ చైర్మన్  వేనాటి పరందామరెడ్డి గారు అనారోగ్యం కారణంగా ఈరోజు స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారు.

Featured గూడూరు

నీళ్ల కష్టాలు తీరేది ఎప్పుడు?

ఒక పక్క కరోనా భయంతో ,ఇళ్ళ నుండి బయటకు రావద్దు అని చెప్తుంటే మరో పక్క గ్రామాలలో నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … ప్రభుత్వలు ఎన్ని మారిన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటున్న గ్రామ ప్రజలు… వివరాలలోకెలితే నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో గత 20 సంవత్సరల నుంచి ప్రభుత్వలు ఎన్ని మారిన నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … గతవారం రోజులుగా మంచినీళ్లు లేక గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇక్కడ నీళ్లట్యాంకర్లు తొలి కొంతమంది డబ్బులు సంపదించుకుంటున్నారు, ఈ గ్రామంలో ఒక ప్రజా ప్రతినిధి ఉండడం గమనార్హం,కాని అధికారులు పట్టించుకోనేవాళ్లు ఎవరు లేరు.ఇకనైన ఎవరైన అధికారులు స్పందిస్తారని వాళ్లు వేడుకుంటున్నారు