అరకువ్యాలీ: మండల పరిషత్ 2021–26 పదవీకాలానికి సంబంధించి ప్రత్యేక సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ రంజాపల్లి ఉషారాణి అధ్యక్షతన జరిగింది. ఎంపీడీవో వీసం ప్రసాద్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, కొర్రా సుమాంజలి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఆత్మీయంగా సత్కరించారు. విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర కార్యక్రమంలో పాల్గొన్నారు. 2021–26 పదవీకాలంలో సభ్యులు అందించిన సహకారం, ప్రజాసేవల్లో భాగస్వామ్యాన్ని అభినందించారు.

అరకు: ఎంపీటీసీ సభ్యుల ప్రత్యేక సమావేశం