ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు ఈనాడు, అమరావతి: సర్టిఫికేట్ల పరిశీలన పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల సర్టిఫికేట్లను ఏపీడిజీవెరిఫైలో భద్రపరుస్తోంది. పాత రికార్డులతో సహా రియల్ టైమ్ డేటాను భద్రపరుస్తోంది. సర్టిఫికేట్లలో ఏ క్షణంలో మార్పులు జరిగితే ఆ తక్షణమే సిస్టమ్లో సమాచారం అప్డేట్ అవుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల పరిశీలనకు ఈ డేటాను అందుబాటులో ఉంచింది. ఎవరూ డేటా హ్యాక్ చేయకుండా ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రభుత్వం వినియోగిస్తోంది. విద్యార్థులు సమర్పించే సర్టిఫికేట్ ఒరిజినలో కాదో దీని ద్వారా పరిశీలించవచ్చు.


