Monday, 28 September 2026
  • Home  
  • అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నుంచి కాపాడాలి భవన నిర్వహణ బాధ్యతలను ఎస్సీ కమిటీకి అప్పగించాలి – ప్రజావాణిలో ఆప్ నాయకుల వినతి
- నిర్మల్

అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నుంచి కాపాడాలి భవన నిర్వహణ బాధ్యతలను ఎస్సీ కమిటీకి అప్పగించాలి – ప్రజావాణిలో ఆప్ నాయకుల వినతి

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, దుర్వినియోగం నుంచి కాపాడాలని, భవన నిర్వహణ బాధ్యతలను తక్షణమే చట్టబద్ధంగా ఎస్సీ సామాజిక వర్గ కమిటీకి అప్పగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆప్ నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు మెరుగు రాజన్న మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు, విద్యార్థులు, యువత సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మక అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారులు పశువుల సంరక్షణ సిబ్బంది, కోతుల నివారణ సిబ్బంది స్థావరంగా, చెత్తాచెదారం నిల్వ చేసే గోడౌన్‌గా మార్చడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి అధికారుల నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింటోందని, భవన నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్, టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవనాన్ని తక్షణమే ఖాళీ చేయించి, ఎస్సీ సామాజిక వర్గ కమిటీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నిర్మల్ జిల్లా జనరల్ సెక్రటరీ సీహెచ్. వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, దుర్వినియోగం నుంచి కాపాడాలని, భవన నిర్వహణ బాధ్యతలను తక్షణమే చట్టబద్ధంగా ఎస్సీ సామాజిక వర్గ కమిటీకి అప్పగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆప్ నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు మెరుగు రాజన్న మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు, విద్యార్థులు, యువత సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మక అంబేడ్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారులు పశువుల సంరక్షణ సిబ్బంది, కోతుల నివారణ సిబ్బంది స్థావరంగా, చెత్తాచెదారం నిల్వ చేసే గోడౌన్‌గా మార్చడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి అధికారుల నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింటోందని, భవన నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్, టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవనాన్ని తక్షణమే ఖాళీ చేయించి, ఎస్సీ సామాజిక వర్గ కమిటీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నిర్మల్ జిల్లా జనరల్ సెక్రటరీ సీహెచ్. వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, నాయకులు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.