డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గారపాటివారి వీధిలో గణేష్ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన భారీ గణనాథుడి విగ్రహాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్తిగీతాల నడుమ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గారపాటివారి వీధిలో గత 70 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నామని పేర్కొన్నారు. శోభాయాత్రలో స్థానిక యువత, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

అమలాపురం గారపాటివారి వీధిలో ఘనంగా గణేష్ శోభాయాత్ర