ఔషధ గుణాల అద్భుతం బెల్లం!
బెల్లం మలబద్దకానికి మంచి మందులా పని చేస్తుంది.
దగ్గు జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
మనం పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాక తర చుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్య వసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకున్నాక దాని తీపి మరికాస్త పెరిగినట్టనిపిస్తుంది- జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజై ములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పని తీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి మంచి మందులా పని చేస్తుంది.
లివర్‌లోని హానికరమైన విషాలను బయటకు తోసేందుకు తోడ్పడుతుంది. శరీరం లోని వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు నెడుతుంది.
దగ్గు జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇలాంటి లక్ష ణాలు కనిపించినపుడు దీన్ని వేడి నీటితో కానీ టీలో వేసుకుని కానీ తాగితే మంచిది.
రక్తాన్ని శుద్ధి చేసే లక్ష ణాలు బెల్లంలో ఉన్నాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతి రేకంగా పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
శ్వాసనాళం, ఊపిరి తిత్తులు, పేగులు, పొట్ట, అన్న వాహిక వీటన్నింటినీ శుభ్రం చేసే శక్తి బెల్లంకి ఉంది. గనులు, ఫ్యాక్ట రీలు, సిమెంటు పనులు, ఇంకా కాలు ష్యంతో కూడిన ప్రాంతాల్లో పని చేసే వారికి ఇది మంచి ఔషధంలా పని చేస్తుంది.
ప్రి మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా నెలసరికి ముందు ఇబ్బం దులు పడేవారు, ఆ సమయంలో నొప్పు లను అనుభవించేవారు దీన్ని తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి.
బెల్లంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్
ఉండటం వలన రక్తలేమిని నివారిస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గ కుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత మేలు చేస్తుంది.
ఇందులో మెగ్నీషియం ఎక్కువ మోతా దులో ఉండటం వలన పేగులకు బలం చేకూ రుస్తుంది. ప్రతి పది గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది మనకు ఒకరోజుకి కావాల్సిన మెగ్నీషియం లో నాలుగోవంతుని అందిస్తున్నట్టు లెక్క.
ఇది మన శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీక రిస్తుంది. దీని వలన శరీరం చల్లబడుతుంది. అందుకే ఎండా కాలంలో చల్లని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగమని ఆరోగ్యనిపుణులు చెబు తుంటారు.
ఇందులో పొటాషియం, సోడియం ఉండటం వలన శరీరంలో యాసిడ్స్ లెవల్స్ సక్రమంగా ఉంచేశక్తి దీనికి ఉంది. రక్తపోటుని సైతం క్రమబద్ధీక రిస్తుంది.
శ్వాస క్రియ సమర్ధవంతగా ఉంచ డంలో బెల్లం శక్తిమంతంగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులతో కలిపి దీన్ని తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన చక్కని మేలు చేస్తుంది.
జాయింట్ నొప్పులతో బాధపడుతున్న వారికి బెల్లం మంచి ఔషధంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాస్తం బెల్లం ముక్కని అల్లంతో కలిపి తీసు కుంటే నొప్పులకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఎముకలకు మం చిది.
బెల్లం బరువు తగ్గడానికి దోహద పడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, కండరాల నిర్మాణంలో మెటబాలిజంని పెంచ డంలో శరీరంలో నీటిని తగ్గించడం లో తోడ్పడి బరువుని అదుపులో ఉంచు తుంది.
పంచదార కంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో బెల్లం మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది. పంచదారలా ఒక్కసారిగా కాకుండా శరీరానికి ఎక్కువ సమయం కార్బో హైడ్రేట్‌లను ఇవ్వగలుగుతుంది. అందువలన రక్తంలో ఒక్కసారిగా షుగర్ స్థాయి పెరగదు. అలాగే బెల్లం శరీరంలో అలసటని, బలహీ నతని పోగొడుతుంది. బెల్లంలో ఇన్ని అద్భుత గుణాలుండటం విశేషమే. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.

