04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, తహసీల్దార్ షఫీ మాలిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.
మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.