జనగామలో ఘనంగా కృతజ్ఞతార్పణల పండుగ
——————————————————–
కరుణామయుడైన యేసుప్రభువు చూపిన ప్రేమను సమాజంలో ప్రకటించడంలో ప్రతి ఒక్కరూ ప్రథములుగా నిలవాలని కరుణాపురం క్రీస్తుజ్యోతి మందిరము ప్రతినిధి బ్రదర్ యోసేపు పాల్ పిలుపునిచ్చారు.
జనగామ పట్టణంలోని గెత్సేమనే ప్రార్థన మందిరములో ఆదివారం కృతజ్ఞతార్పణల పండుగ ఘనంగా జరిగింది. సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాశ్ గోపుల నిర్వహణ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు బ్రదర్ యోసేపు పాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘకాపరి బ్రదర్ హనోకు పాల్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బ్రదర్ యోసేపు పాల్ మాట్లాడుతూ.. మనం చేసే ప్రతి పనిలో నిబద్ధత, అంకితభావంతో ముందుకెళ్తే తప్పకుండా ఉన్నత స్థానంలో నిలుస్తామని అన్నారు. “ప్రతి ఒక్కరూ దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో జీవించాలని, దేవుని కృపతోనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉండి, ఏడాది పొడవునా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ప్రతి విశ్వాసి బాధ్యత అని ఆయన హితవు పలికారు.
విశ్వాసులు, సంఘ సభ్యులు ప్రత్యేక స్తుతి గీతాలతో దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు జి. కృష్ణ, ఇనుముల నర్సయ్య, కాగితాల రవి, మెకానిక్ రవి, మేకల నరేష్, మేడబోయిన రాజు, విజయ్, బాలాజీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
