శాస్త్రీయ దృక్పథం పెంపుదలలో JVV కృషి గొప్పది
—డీసీపీ రాజా మహేంద్ర నాయక్
విద్యార్థులలో శాస్త్రీయదృక్పధం పెంపుదల చేస్తూ ,సామాజంలో ఉన్న మూఢ విశ్వాసాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయమని డీసీపీ రాజా మహేంద్ర నాయక్ అన్నారు
జనవిజ్ఞాన వేదిక జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబురాలు JVV జిల్లా అధ్యక్షులు రసాల బాల రాజు అధ్యక్షతన ఏకశిలా B. Ed కాలేజ్ లో జరిగిన సమావేశం లో ముఖ్య అతిధి హాజరై మాట్లాడుతూ విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ,మూఢవిశ్వాసాలు మానవ ప్రగతికి ఆటంకంగా మారాయని ,విద్యార్థులలో చిన్న వయసు నుండే శాస్త్రీయ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో JVV కృషి అభినందనీయమని అన్నారు
ఈ సమావేశంలో .Dr మాచర్ల భిక్షపతి మాట్లాడుతూ సైన్స్ ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని ,భారత దేశంలో యువత అధికంగా ఉందని ,సైన్స్ ఆవిష్కరణలు చేయడం వల్ల భవిష్యత్తు అంతా దేశానిదే అన్నారు
Dr. వంశీ మాట్లాడుతూ పిల్లల్లో జంక్ ఫుడ్ వినియోగం వల్ల శరీర పెరుగుదలలో ఇబ్బందులు వస్తున్నాయని ,మధుమేహం పెరుగుదలకు ఇది ఒక కారణమని అన్నారు
ఈ జిల్లా స్థాయి పోటీలలో ప్రభుత్వ పాఠశాలల నుండి 15 టీమ్స్ ,residential విభాగం 12 టీమ్స్ ,ప్రైవేట్ స్కూల్స్ 10 టీమ్స్ పాల్గొన్నాయి
ఈ పోటీలలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ప్రభుత్వ పాఠశాలల విభాగం నుండి PMSHRI ZPHS ధర్మ కంచ
ప్రభుత్వ RESIDENTIAL విభాగం నుండి TGMS లింగాల ఘన్పూర్
ప్రైవేట్ విభాగం నుండి ఏకశిలా పబ్లిక్ స్కూల్ జనగామ లు ఎన్నికయ్యాయి
ఈ సమావేశంలో ఏకశిలా స్కూల్ ప్రిన్సిపాల్ Dr ఉపేందర్ రెడ్డి ,ఏకశిలా B. Ed కాలేజ్ ప్రిన్సిపాల్ మార్రెడ్డి ,రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ,Dr రక్షిత ,,JVV రాష్ట్ర బాధ్యులు ఆకుల శ్రీనివాస రావు ,శ్రీనాథ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుండె కనకయ్య ,మార్రెడ్డి ,శోభన్ బాబు ,రవీందర్ ,శ్రీనివాస చారి ,చంద్రశేఖర్ రావు ,ఉమాదేవి ,అంజనేయా చారి ,కృష్ణ ,సత్తయ్య ,లతో పాటు వివిధ పాఠశాలల నుండి గైడ్ టీచర్స్ తో పాటు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో విద్యార్థుల స్వంత కథ ల రచనలకు కూడా అవకాశం కల్పించారు ,చక్కని రచనలతో కూడిన బుక్ ను JVV పక్షాన ప్రచురిస్తున్నామని తెలిపారు

