Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నందిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు

Date 27-11-2026
నందిపాడు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ( KA02AD4878)నుంచి పామూరు సమీప ప్రాంతానికి సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తున్న ఓ కారు నందిపాడు సమీపానికి చేరుకోగానే టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును బలంగా ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంతో స్థానికంగా కొద్దిసేపు ఆందోళన నెలకొంది. టైరు పంక్చర్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడిని వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి కీ తరలించారు

నందిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు

నందిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *