Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజన ఆడపడుచు వివాహానికి రూ.10,116 పెళ్లి కానుక అందించిన కంచి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిరిజన ఆడపడుచు వివాహానికి రూ.10,116 పెళ్లి కానుక అందించిన కంచి

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):పేద గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
  • ఇందులో భాగంగా గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన గిరిజన యువతి చలంచర్ల వెంగమ్మ వివాహానికి ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.'గిరిజన ఆడపడుచులకు పెళ్లి కానుక' కార్యక్రమం కింద వధువు వెంగమ్మకు రూ.10,116 నగదు చెక్కుతో…
  • నూతన దంపతులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలపై అవగాహన కల్పించి వాటిని పూర్తిగా అరికట్టడంతో పాటు పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఆత్మకూరు, నవంబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):పేద గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన గిరిజన యువతి చలంచర్ల వెంగమ్మ వివాహానికి ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.’గిరిజన ఆడపడుచులకు పెళ్లి కానుక’ కార్యక్రమం కింద వధువు వెంగమ్మకు రూ.10,116 నగదు చెక్కుతో పాటు వధూవరులిద్దరికీ నూతన పట్టు వస్త్రాలను కంచి పరమేశ్వర రెడ్డి దంపతులు అందజేశారు. నూతన దంపతులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలపై అవగాహన కల్పించి వాటిని పూర్తిగా అరికట్టడంతో పాటు పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆడపడుచుల వివాహాలకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.కేవలం వివాహ సహాయానికే పరిమితం కాకుండా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నప్రసాద వితరణతో పాటు పలు సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిరంతరం నిర్వహిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *