పామూరు, నవంబర్ @7:29(పున్నమి తెలుగు దినపత్రిక ) కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పామూరు పట్టణంలో ఉగ్రరూపం దాల్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విషయం మండల స్థాయిలో అందరికి తెలుసు. ఈనెల 26 తేదీన పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల సందర్బంగా, పామూరు వచ్చిన యం. యల్. ఏ.ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో 6 మండలాల్లో పామూరు చరిత్ర గొప్పదని, రాజకీయ విశ్లేషణ చేసే స్థాయిలో ప్రతి ఓటరు ఏదిగాడని యం. యం. ఏ. అన్నారు.. పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రాముఖ్యత గుర్తించి,టీడీపీ కూటమి సర్పంచ్ షేక్. షంషూర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా పని చేస్తానని యం. యల్. ఏ. అన్నారు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక మమ్మి, డాడీ సెంటర్లో వుండే యం. యల్. ఏ. ప్రియమిత్రుడు ఊసా మధు గారిని కలిసి, కాసేపు మాట్లాడటం జరిగింది..


