*ఘనంగా జిల్లా స్థాయి కలెక్టర్ కప్ – 2026 ఇండోర్ గేమ్స్ ముగింపు వేడుకలు*
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
======
*కలెక్టర్ కప్ ఇండోర్ గేమ్స్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది*
*క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు చదువులోనూ మెరుగ్గా రాణించేందుకు దోహదం*
*విజయం, ఓటమి కంటే క్రీడల్లో పాల్గొనడం ముఖ్యం.. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి*
ఆదివారం, జిల్లా కేంద్రంలోని ధర్మకంచ స్టేడియంలో చేపట్టిన *జిల్లా స్థాయి కలెక్టర్ కప్–2026 ఇండోర్ గేమ్స్* ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు *ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* హాజరు కాగా, ముగింపు వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు చదువులోనూ మెరుగ్గా రాణించేందుకు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
*సంకీర్తన, 9వ తరగతి, కేజీబీవీ బచ్చన్నపేట* మాట్లాడుతూ.. కలెక్టర్ కప్‌లో యోగాలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో యోగాను తన జీవితంలో భాగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. పోటీలో గెలవకపోయినా పాల్గొనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని, తాను పోటీలో పాల్గొన్నందుకు తన తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారని తెలిపారు. విద్యార్థులందరూ ఏదైనా పోటీలో పాల్గొనేందుకు మొదటి అడుగు వేయాలని, విజయం సాధించినా, సాధించకపోయినా పాల్గొనడం ముఖ్యమని సూచించారు.
*నీలు, 9వ తరగతి, పీఎం శ్రీ పాఠశాల* మాట్లాడుతూ.. కలెక్టర్ కప్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, క్రీడను క్రమశిక్షణతో ఎలా ఆడాలో తెలుసుకున్నానని తెలిపారు. చెస్ పోటీలో పాల్గొన్నప్పటికీ ఓటమి చెందానని, వచ్చేసారి తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు.
*తేజస్విన్, న్యూ క్రియేషన్ స్కూల్* మాట్లాడుతూ.. అండర్–17 బాలుర బ్యాడ్మింటన్ విభాగంలో ప్రథమ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ కప్ క్రీడా వాతావరణం పండుగలా ఉందని, క్రీడాకారులకు కల్పించిన సదుపాయాలను ఎంతో ఆనందంగా ఆస్వాదించామని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన *కలెక్టర్ సార్‌కు* కృతజ్ఞతలు తెలిపారు.
*కె. అరుణ్, పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కోల్కొండ, దేవరుప్పుల* మాట్లాడుతూ.. ఈరోజు టేబుల్ టెన్నిస్ పోటీలో పాల్గొన్నానన్నారు. ఈ సంవత్సరం టేబుల్ టెన్నిస్‌ను కొత్తగా ప్రవేశపెట్టడం, కలెక్టర్ కప్‌ను ప్రారంభించడం విద్యార్థులకు ఎంతో మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన *కలెక్టర్ సార్‌కు* కృతజ్ఞతలు తెలిపారు. పోటీలో ఓటమి చెందినప్పటికీ వచ్చేసారి పూర్తి స్థాయిలో కృషి చేసి విజయం సాధిస్తానని అన్నారు.
*తన్విత, 9వ తరగతి, గీతాంజలి హైస్కూల్* మాట్లాడుతూ.. టేబుల్ టెన్నిస్‌లో మండల స్థాయిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ పోటీలను నిర్వహించిన *జిల్లా కలెక్టర్ సార్‌కు* ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించాలని కోరారు. ఈ పోటీల ద్వారా మరింత మంది విద్యార్థులు పాల్గొని, తమ ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం కల్పించాలని అన్నారు.
*సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్* మాట్లాడుతూ.. కలెక్టర్ కప్‌లో అండర్–17 క్యారమ్స్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ తరహా క్రీడలు శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు చదువులోనూ మెరుగ్గా రాణించేందుకు ఎంతో సహాయపడుతున్నాయని, వీటి ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
అనంతరం అండర్-14, అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో విజేతలకు, అలాగే CWSN విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10,000 నగదు, కప్, ద్వితీయ బహుమతిగా రూ.6,000 నగదు, కప్, తృతీయ బహుమతిగా రూ.4,000 నగదు, కప్, అలాగే ప్రశంసాపత్రాలను అందజేశారు. అదే విధంగా పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీవైఎస్ఓ నరసింహా రావు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి గోర్ సింగ్, జీసీడీఓ గౌసియా బేగం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజ్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, వివిధ జిల్లాల పాఠశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.




