Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక కార్పెంటర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం – నూతన అధ్యక్షుడు అశోక్ ఆత్మకూరు: కొయ్య వృత్తిదారుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ఆత్మకూరులో విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
  • ఈ మేరకు పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్‌లో కార్పెంటర్లు, చెక్కపని నిపుణులు, అనుబంధ వృత్తిదారులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా పేరుస్వాముల అశోక్, ఉపాధ్యక్షుడిగా షేక్ అల్లా బక్షు, కార్యదర్శిగా షేక్ మీరావలి, సంయుక్త కార్యదర్శిగా పేరుస్వాముల వీరాచారి, కోశాధికారిగా వంగిపురపు వినోద్ ఎన్నికయ్యారు.
  • కార్యవర్గ సభ్యులుగా ఏ.

స్థానిక కార్పెంటర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం – నూతన అధ్యక్షుడు అశోక్

ఆత్మకూరు: కొయ్య వృత్తిదారుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ఆత్మకూరులో విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్‌లో కార్పెంటర్లు, చెక్కపని నిపుణులు, అనుబంధ వృత్తిదారులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.సంఘం అధ్యక్షుడిగా పేరుస్వాముల అశోక్, ఉపాధ్యక్షుడిగా షేక్ అల్లా బక్షు, కార్యదర్శిగా షేక్ మీరావలి, సంయుక్త కార్యదర్శిగా పేరుస్వాముల వీరాచారి, కోశాధికారిగా వంగిపురపు వినోద్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఏ. బ్రహ్మయ్య, షేక్ ఇస్మాయిల్, చేజర్ల మల్లికార్జునచారిని ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, ఇతర ఖర్చులతో స్థానిక కార్పెంటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ బయటి ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకురావడం వల్ల స్థానిక వృత్తిదారులకు పనులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా అనేక కుటుంబాలు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక కార్పెంటర్లందరినీ సంఘం పరిధిలోకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడతామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. స్థానిక వృత్తిదారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, యజమానులు తమ ఇళ్లకు అవసరమైన చెక్కపనుల కోసం స్థానిక కార్పెంటర్లకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సీనియర్ కార్పెంటర్లతో పాటు సుమారు 50 మంది వృత్తిదారులు, అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *