వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు: మనుబోలు మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- చంద్రారెడ్డి పొలాల సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది.తిరుపతి నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మనుబోలు బైపాస్ సమీపానికి చేరుకోగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
- టైరు పేలడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు.
నెల్లూరు: మనుబోలు మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రారెడ్డి పొలాల సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది.తిరుపతి నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మనుబోలు బైపాస్ సమీపానికి చేరుకోగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. టైరు పేలడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.