వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు, నవంబర్ (పున్నమి): పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకుంటే విజ్ఞానం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
- పుస్తక పఠనం మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.నెల్లూరులో పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి…
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు.
నెల్లూరు, నవంబర్ (పున్నమి): పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకుంటే విజ్ఞానం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పుస్తక పఠనం మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.నెల్లూరులో పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. విద్యార్థులు, యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పఠనాసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.