Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాసిలి సర్పంచ్ పోరులో పెంచల చౌదరి ఎంట్రీ.. నామినేషన్‌తో ఎన్నికల సందడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాసిలి సర్పంచ్ పోరులో పెంచల చౌదరి ఎంట్రీ.. నామినేషన్‌తో ఎన్నికల సందడి!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు రూరల్, నవంబర్ 20: ఆత్మకూరు రూరల్ మండలంలోని వాసిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి నిలిచారు.
  • ఈ మేరకు ఆయన శుక్రవారం సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
  • రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మద్దతు ప్రకటించారు.

ఆత్మకూరు రూరల్, నవంబర్ 20: ఆత్మకూరు రూరల్ మండలంలోని వాసిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి నిలిచారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మద్దతు ప్రకటించారు. పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుంకర పెంచల చౌదరి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో వాసిలి పంచాయతీ ఎన్నికలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.వాసిలి గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలనే సంకల్పంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన అభ్యర్థిత్వం ద్వారా ప్రజాసేవకు ముందడుగు వేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *