వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు (హరనాథపురం), నవంబరు: బుచ్చిరెడ్డిపాళెం మండలం పురంధరపురం పంచాయతీలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
- గురువారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నెల్లూరు (హరనాథపురం), నవంబరు: బుచ్చిరెడ్డిపాళెం మండలం పురంధరపురం పంచాయతీలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గురువారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.