Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం జనసేన అభ్యర్థి మెరుగు స్వాతి ఎమ్మెల్యే వసంత ఎక్కడ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక కలిశారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు మండలం జనసేన అభ్యర్థి మెరుగు స్వాతి ఎమ్మెల్యే వసంత ఎక్కడ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక కలిశారు

ఎన్టీఆర్ జిల్లా

మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఐతవరం లోని వారి స్వగృహం లో గురువారం జనసేన విజయవాడ పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం ఎన్డీయే కూటమి(జనసేన) మద్దతు సర్పంచ్ అభ్యర్థి మేరుగు స్వాతి, జనసేన క్రియాశీలక నాయకులు మేరుగు నాగేశ్వరరావు(నాని) మర్యాద పూర్వకంగా కలిశారు.

సర్పంచ్ అభ్యర్థి ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుర్రాజుపాలెంలో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాన్ని ఈ సందర్భంగా శీలం బ్రహ్మయ్య ఎమ్మెల్యే వసంత దృష్టికి తీసుకువెళ్లారు.

ఎమ్మెల్యే వసంత ఆశీస్సులతో కూటమి అభ్యర్థిగా స్వాతి బరిలోకి దిగిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు.

ఒకానొక దశలో గురాజుపాలెం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమోతుందనుకున్న తరుణంలో కూటమి లో కొందరి తీరు ఇబ్బంది కరంగా మారిందని తెలిపారు.

నామినేషన్ విత్ డ్రా సమయం సమీపిస్తున్నందున ఎమ్మెల్యే చొరవ చూపి సర్పంచ్ అభ్యర్థి స్వాతి కి న్యాయం చేయాలని అభ్యర్థించారు.

శీలం బ్రహ్మయ్య అభ్యర్థనకి సానుకూలంగా స్పందించిన వసంత కూటమి మిత్ర ధర్మాన్ని పాటిస్తామని భరోసా ఇచ్చారు. జనసేన ప్రాదాన్యత మిత్ర ధర్మాన్ని అనుసరించి సముచిత స్థానం లో ఉంటుందని హామీ ఇచ్చారు.

జి కొండూరు మండలం జనసేన అభ్యర్థి మెరుగు స్వాతి ఎమ్మెల్యే వసంత ఎక్కడ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక కలిశారు

జి కొండూరు మండలం జనసేన అభ్యర్థి మెరుగు స్వాతి ఎమ్మెల్యే వసంత ఎక్కడ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక కలిశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *