Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

కృష్ణా జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కృష్ణా జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు

వార్త ముఖ్యాంశాలు

  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
  • మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు.
  • కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నాయని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలను అధిష్ఠానం పరిశీలిస్తోందని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *