Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు: కాకాణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు: కాకాణి

వార్త ముఖ్యాంశాలు

  • కావలి, నవంబర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమారరెడ్డి…
  • కేసులు, వేధింపులతో వైసీపీ నాయకులను భయపెట్టడం సాధ్యం కాదని అన్నారు.ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక అధికారుల ద్వారా నామినేషన్లను తిరస్కరింపజేస్తున్నారని విమర్శించారు.
  • ఎన్నికల ప్రక్రియలో అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

కావలి, నవంబర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమారరెడ్డి సౌమ్య స్వభావం కలిగిన నాయకుడైనప్పటికీ, రాజకీయంగా ధైర్యంగా పోరాడే వ్యక్తి అని కాకాణి పేర్కొన్నారు. కేసులు, వేధింపులతో వైసీపీ నాయకులను భయపెట్టడం సాధ్యం కాదని అన్నారు.ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక అధికారుల ద్వారా నామినేషన్లను తిరస్కరింపజేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా పోటీ చేయాలనుకుంటే నేరుగా ఎన్నికల బరిలోకి వచ్చి ప్రజల తీర్పును కోరాలని కూటమి నాయకులకు సవాల్ విసిరారు.అక్రమ కేసులు, రాజకీయ వేధింపులు ఎన్ని ఎదురైనా వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గబోవని కాకాణి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *