Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో జనగణన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరులో జనగణన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • జనగణన–2027కు సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
  • బుధవారం ముగింపు తరగతులను కమిషనర్ వై.ఓ.
  • నందన్ పర్యవేక్షించారు.

జనగణన–2027కు సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. బుధవారం ముగింపు తరగతులను కమిషనర్ వై.ఓ. నందన్ పర్యవేక్షించారు. సెన్సస్ చార్జ్ అధికారి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో మాస్టర్ ట్రైనర్లు డాక్టర్ మాల్యాద్రి, కోటేశ్వరరావు పవర్‌పాయింట్ ద్వారా శిక్షణ ఇచ్చారు.

2027లో జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ నమోదు, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనాభా గణన, మార్చి 1 నుంచి 5 వరకు సవరణ దశ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ఫీల్డ్ ట్రైనర్లు తమ పరిధిలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు గణన విధానంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసి జనగణనలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా జనగణన ఇన్‌చార్జి ఎం. రాజమోహన్‌రెడ్డి, అదనపు జిల్లా ఇన్‌చార్జి ఆధ్విక పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఇతర మూలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *