వార్త ముఖ్యాంశాలు
- ఐదు కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ..
- పటిష్ట పోలీసు బందోబస్తు సీతారామపురం: మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
- నామినేషన్ల కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చిన్న చెన్నారావు తెలిపారు.
ఐదు కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ.. పటిష్ట పోలీసు బందోబస్తు
సీతారామపురం: మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నామినేషన్ల కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చిన్న చెన్నారావు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ వెంకట రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.