Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగర ప్రజలూ ఇక సెలవు : టాటా ……గుడ్ బై ……వీడికోలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు నగర ప్రజలూ ఇక సెలవు : టాటా ……గుడ్ బై ……వీడికోలు

వార్త ముఖ్యాంశాలు

  • --21న నెల్లూరు ప్రస్తుత కౌన్సిల్ వీడ్కోలు సభ --ఈ కౌన్సిల్ కు ఇదే చిట్ట చివరి సమావేశం -- పోతూ పోతూ కూడా తమదైన శైలిలో అజెండా -- అజెండాలో ఇంటి పన్నుల రద్దు విషయాలే మింగుడు పడని వైనం ఈ నెల 21వ తేదీ శనివారం…
  • దీంతో 21వ తేదీ కార్పొరేషన్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.
  • మేయర్‌తో కలిపి ప్రస్తుతం ఉన్న 54 మంది కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులకు ఈ వీడ్కోలు సభ జరగనుంది.

–21న నెల్లూరు ప్రస్తుత కౌన్సిల్ వీడ్కోలు సభ
–ఈ కౌన్సిల్ కు ఇదే చిట్ట చివరి సమావేశం
— పోతూ పోతూ కూడా తమదైన శైలిలో అజెండా
— అజెండాలో ఇంటి పన్నుల రద్దు విషయాలే మింగుడు పడని వైనం

ఈ నెల 21వ తేదీ శనివారం నాటికి ప్రస్తుతం ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమయం ముగుస్తుంది. దీంతో 21వ తేదీ కార్పొరేషన్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. మేయర్‌తో కలిపి ప్రస్తుతం ఉన్న 54 మంది కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులకు ఈ వీడ్కోలు సభ జరగనుంది. వారి పదవీకాలాలకు 5 ఏళ్లు ముగియడంతో 21వ తేదీ నాటికి వారి పదవులు, అధికారాలు ముగుస్తున్నాయి. వారంతా 22 వ తేదీ నుంచి మాజీలుగా మిగిలిపోనున్నారు. ఈ కౌన్సిల్ కు సంబంధించి వారికి ఇదే చిట్ట చివరి సమావేశం

అయితే ఇటీవల జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమంది పాత కార్పొరేటర్లు కూడా పోటీ చేసి విజయం సాధించి ఉన్నారు. వారు కొత్త కౌన్సిల్‌లో మరోసారి అడుగుపెట్టి రాజీలేని కార్పొరేటర్లుగా కొనసాగబోతున్నారు.

అయితే ఈ వీడ్కోలు సమావేశంలో కూడా పోతూ పోతూ ఓ అజెండాను తయారు చేసి, ఆ అజెండాలోని అంశాలను ఆమోదించబోతున్నారు. ఈ అజెండాలో అనేక అభివృద్ధి పనులకు చెందిన అంశాలు ఉన్నా, అక్కడక్కడ ఇంటి పన్ను రద్దుల అంశాలు కూడా మధ్యలో చోటు చేసుకుని ఉన్నాయి. ఇవి కొందరు కార్పొరేటర్లకు, కో-ఆప్షన్ సభ్యులకు కూడా మింగుడు పడడం లేదు. పన్నుల రద్దు అంశాలను తమ చివరి వీడ్కోలు సభలో పెట్టి ఆమోదించుకునే ప్రక్రియ ఏమిటి అన్న ప్రశ్నలు కొందరిలో తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా, ఆల్ పాస్ సంస్కృతికి అలవాటు పడి ఉన్న నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ అజెండాలోని అంశాలన్నింటికీ చర్చలు గిర్చలు లేకుండానే ఆల్ పాస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది.

ఈ కౌన్సిల్ ఏర్పడిన మొదట్లో మేయర్‌గా 12వ డివిజన్‌కు చెందిన పొట్లూరి స్రవంతి అధ్యక్ష స్థానంలో ఆసీనులు కాగా, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొద్ది నెలలపాటు డిప్యూటీ మేయర్‌గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగారు. తర్వాత 53వ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకొండ సుజాత మేయర్‌గా గద్దెనెక్కారు. ప్రస్తుతం సుజాత నేతృత్వంలోనే ఈ కౌన్సిల్‌కు చెందిన చివరి సమావేశంగా వీడ్కోలు జరగనుంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *