Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలం లో తొలిరోజు 3 సర్పంచ్, 5 వార్డు సభ్యుల నామినేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలం లో తొలిరోజు 3 సర్పంచ్, 5 వార్డు సభ్యుల నామినేషన్లు

ఆరు కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ.. మిగతా గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు నిల్‌

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బిట్రగుంట: బోగోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలిరోజు మొత్తం మూడు సర్పంచ్, ఐదు వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.

వీటిలో విశ్వనాథరావుపేట గ్రామ పంచాయతీ నుంచి ఒక సర్పంచ్ నామినేషన్, తాళ్లూరు గ్రామ పంచాయతీ నుంచి రెండు సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే తాళ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు వార్డు సభ్యుల నామినేషన్లు కూడా దాఖలయ్యాయి.

మండలంలోని మిగిలిన గ్రామ పంచాయతీల నుంచి తొలిరోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. రానున్న రోజుల్లో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

బోగోలు మండలం లో తొలిరోజు 3 సర్పంచ్, 5 వార్డు సభ్యుల నామినేషన్లు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *